
హైదరాబాద్ : గచ్చిబౌలి స్టేడియంలో యోగా విన్యాసాలు అలరించాయి. తెలంగాణ ఆయుష్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని జీఎంసి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన యోగా డే వేడుకల్లో వేలాదిమంది పాల్గొన్నారు. పలు పాఠశాల విద్యార్థులు, పోలీసులు, సిఐ ఎస్ఎఫ్ జవాన్లు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసీ.సజ్జనార్ ముఖ్యఅతిథిగా హాజరై యోగా ఆసనాలు వేశారు. యోగాలో భారత్ విశ్వగురుగా మారిందని, మన పురాతన సంప్రదాయాన్ని కపాడుకోవలసిన అవసరం ఉందన్నారు. సైబరాబాద్ పోలీసులను ఒత్తిడి నుంచి దూరం చేసేందుకు యోగాను వారి దినచర్యలో భాగం చేస్తున్నామని తెలిపారు.