
హైదరాబాద్, నిఘా 24: ప్రపంచ హృద్రోగ దినోత్సవం సందర్భంగా సిటిజన్ ఆసుపత్రి ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యులు, సిబ్బంది వాక్ ధాన్ నిర్వహించారు. గుండె సంరక్షణ, ఆరోగ్యకరమైన జీవన విధానంపై ప్లే కార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ శేరిలింగంపల్లిలోని సిటిజన్ ఆసుపత్రి నుంచి భేల్ చౌరస్తా వరకు వాకథాన్ చేశారు. వాకథాన్ ను ప్రారంభించిన ఆసుపత్రి రీజినల్ చీఫ్ ఆపరేటింగ్ అధికారి డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ దైనందిన జీవితం ఒత్తిడితో కూడుకున్నదని, తగినంత నిద్ర లేకపోవడం, మానసిక, శారీరక ఒత్తిడి కారణంగా గుండె జబ్బులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.

సాధ్యమైనంత వరకు గుండెకు ఒత్తిడి కల్పించకుండా ఉంటే రోగాలు దరి చేరకుండా ఉంటాయన్నారు. ప్రతి ఏటా హృద్రోగ దినోత్సవం సందర్భంగా సిటిజన్ ఆస్పత్రి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు, సదస్సులను నిర్వహించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవన శైలిని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ప్రతిరోజు నడక, వ్యాయామం దినచర్యలో భాగం చేసుకోవాలని సూచించారు. హాస్పిటల్ సీనియర్ హృద్రోగ నిపుణులు డాక్టర్ సుధీర్ కోగంటి మాట్లాడుతూ ఒళ్ళు నొప్పులు, నీరసం, నిద్రలేమి, ఆందోళన, కోపం, అసహనం, మతిమరుపు వంటివి గుండె జబ్బుకు ముందస్తు సూచనలుగా అనుమానించాలని పేర్కొన్నారు.

ముందుగా పరీక్షలు చేయించుకోవడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు అన్నారు. గుండెపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలని సూచించారు. కొవ్వు పదార్థాలను తగ్గించాలని, ఏవైనా ఆరోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిదని అన్నారు. కార్యక్రమంలో సిటిజన్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
Gaming is more than a hobby; its a lifestyle. Embrace the gaming in you with Lucky Cola
Dear immortals, I need some wow gold inspiration to create.