
హైదరాబాద్ : తెలుగు తేజం పివి సింధు చరిత్ర సృష్టించింది. స్విట్జర్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో విజేతగా నిలిచి 40ఏళ్ళ భారత కలను సాకారం చేసింది. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్‌లో జపాన్ క్రీడాకారిణి ఒకుహరపై 21-7, 21-7 తేడాతో ఘనవిజయం సాధించి భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం పీవీ సింధు సరికొత్త చరిత్ర సృష్టించింది. గత రెండు పర్యాయాలు ఫైనల్ వరకు చేరి తుది సమరంలో ఓటమి చవిచూసిన సింధు ఈ సారి తన జైత్రయాత్ర ను తుడికంటా కొనసాగించి ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.