
గచ్చిబౌలి, నిఘా 24 : అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను గచ్చిబౌలి డివిజన్ పరిధిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గచ్చిబౌలి డివిజన్ పరిధిలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు, ప్రభుత్వ పాఠశాల ఆయాలు, బస్తీ దవాఖాన స్టాఫ్ మెంబర్లు, పారిశుద్ధ్య కార్మికులకు చీరలు.. బహుమతులు అందజేసి శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలో అమలవుతున్న కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ వంటి పథకాలు దేశంలో మరెక్కడ లేవన్నారు. మహిళలకు సముచిత గౌరవం ఇస్తూ, మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ సాయిబాబా ముందుకు వచ్చి డివిజన్ పరిధిలోని మహిళలను సత్కరించడం అభినందనీయమన్నారు.

మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ కనిపించే దేవతలు మహిళలు అని తెలిపారు. మహిళలు తమ జీవితంలో ప్రతి దశలోనూ కుటుంబం సంక్షేమం కోసం అహర్నిశలు పాటుపడుతూ ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గచ్చిబౌలి డివిజన్ టిఆర్ఎస్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, అంజమ్మ, మీనా, సౌజన్యసతీష్ ముదిరాజ్, నరేష్, జగదీష్, నాగపురి అశోక్ యాదవ్, శంకరి రాజు ముదిరాజ్, అక్బర్, ఖాదర్ ఖాన్, గోవింద్, సత్యనారాయణ, పురిడి కృష్ణ, రమేష్ గౌడ్, బిక్షపతి యాదవ్, వెంకటేష్ ముదిరాజ్, మధు, నరేష్ సింగ్, షంలెట్ శ్రీనివాస్, సుధీర్, నందిరాజు, పరమేష్, అరుణ కుమారి, రాణి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
