
హైదరాబాద్ : హైటెక్ సిటీ పరిధిలోని కొండాపూర్ లో అపార్ట్మెంట్ పైనుంచి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కొండాపూర్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలో గల సుబ్బయ్య అర్చిల్డ్ అపార్ట్మెంట్ లో రాఘవేంద్రరావు, శేష సంతోష కుమారిలు నివాసం ఉంటున్నారు. వీరికి గత ఫిబ్రవరి 15నే వివాహం జరిగింది. కాగా లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్న వీరి మధ్య మంగళవారం గొడవ జరిగింది. దీనితో మనస్తాపానికి గురైన సంతోష కుమారి బుధవారం తాము ఉంటున్న అపార్ట్మెంట్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.