
హైదరాబాద్, నిఘా 24: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తన కాంపిటీటర్లకు గట్టి పోటీనిస్తూ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను అప్డేట్ చేస్తుంది. కొత్తగా పోల్ అనే ఆప్షన్ అందుబాటులోకి తెచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది.

ఇందుకోసం వాట్సాప్ చాటింగ్‌ను ఓపెన్ చేసి, అటాచ్ బటన్‌ను నొక్కితే పోల్ ఆప్షన్ పొందవచ్చు.

ఈ ఆప్షన్ తో మీకు కావాల్సిన ప్రశ్నను టైప్ చేసి, దానికి ఆప్షన్లు ఇవ్వొచ్చు. ఈ విధంగా మీరు పోల్స్ ని పోస్ట్ చేయవచ్చు.

కొద్దిరోజుల కిందట కమ్యూనిటీస్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురావడంతో పాటు ఒకేసారి 32మందికి గ్రూప్ వీడియో కాల్స్ చేయడం, గ్రూప్ సభ్యుల సంఖ్యను రెండింతలు చేసింది. వీటితోపాటు పోల్ ఆప్షన్ ను జతచేసిన వాట్సప్ రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి రాబోతుంది.