
హైదరాబాద్ : విద్యా రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా తనకు ప్రదానం చేసిన విద్యారత్న అవార్డును దివంగత కేంద్ర మాజీమంత్రి అరుణ్ జెట్లీకి అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు లయన్, డాక్టర్ పొన్నాడ త్రిమూర్తులు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని అంజయ్య నగర్ కు చెందిన విద్యా హై స్కూలు కరస్పాండెట్ డాక్టర్ పొన్నాడ త్రిమూర్తులు శనివారం దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రతిష్టాత్మక విద్యా రత్న అవార్డును అందుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక అధికారి డా. సముద్రాల వేణుగోపాల చారి, జస్టిస్ పిఎస్ నారాయణ, జస్టిస్ మధుసూదన రావుల చేతుల మీదగా నార్త్ ఢిల్లీ కల్చర్ అకాడమి ఈ అవార్డును అందజేసింది. ఈ సందర్భంగా డా. పొన్నాడ త్రిమూర్తులు మాట్లాడుతూ ఈ అవార్డు తమపై మరింత బాధ్యతను పెంచిందన్నారు. తాను అందుకున్న అవార్డును శనివారం అకాల మరణం చెందిన అరుణ్ జైట్లీకి అంకితం ఇస్తున్నట్లు తెలిపారు.