
హైదరాబాద్ : శేరిలింగంపల్లి మండలం పరిధిలోని అంజయ్యనగర్ కు చెందిన విద్యా హై స్కూల్ కరస్పాండెట్ లయన్ డాక్టర్ పొన్నాడ త్రిమూర్తులు ప్రతిష్టాత్మక విద్యా రత్న అవార్డుకు ఎంపికయ్యారు. విద్యా రంగంలో చేసిన విశేష సేవలకు గుర్తింపుగా త్రిమూర్తులును విద్యా రత్న అవార్డు వరించింది. ఈ మేరకు ఈ నెల 24వ తేదీన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో త్రిమూర్తులు ఈ అవార్డును అందుకొనున్నారు. న్యూఢిల్లీలో గల ఆంధ్రప్రదేశ్ భవన్ లో జరిగే కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా డాక్టర్ త్రిమూర్తులు అవార్డును అందుకొనున్నారు. విద్యా రత్న అవార్డుకు త్రిమూర్తులు ఎంపిక కావడం పట్ల స్కూల్ ఉపాద్యాయులు, స్థానిక నాయకులు హర్షం వ్యక్తంచేశారు.
9 Comments