
శేరిలింగంపల్లి, నిఘా24: చెరువులు, నాలాలను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు. గతకొన్ని రోజులుగా శేరిలింగంపల్లి పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉన్న చెరువులు, నాలాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్న రెవెన్యూ అధికారులు నీటి వనరులను ఆక్రమించి చేపట్టిన అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఖాజాగుడా పెద్ద చెరువు నాలాలో వెలిసిన అక్రమ నిర్మాణాలను అధికారులు మంగళవారం కూల్చివేశారు. ఖాజాగుడా పెద్దచెరువు నుంచి మణికొండ ఎల్లమ్మ చెరువు మధ్యలో ఉన్న నాలా ను ఆక్రమించి నిర్మాణాలు వెలిశాయి. దీంతో శేరిలింగంపల్లి తహశీల్దార్ వంశీమోహన్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇనిస్పెక్టర్ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టారు.
