తెలంగాణ

దసరా ప్రయాణాల కోసం ముందస్తు బుకింగ్ పై టీఎస్ఆర్టీసీ 10శాతం రాయితీ

తెలంగాణ, నిఘా24 : దసరాకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త అందించింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి 10 శాతం రాయితీ ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. దసరా సెలవులైన అక్టోబర్ 15 నుంచి 29 తేదీల మధ్యలో రానుపోనూ ప్రయాణాలు సాగించే వారు ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే, తిరుగు ప్రయాణం పై 10 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు ప్రకటించింది. అక్టోబర్ 15 నుంచి 29 మధ్య ప్రయాణం కోసం ముందస్తుగా ఈ నెల 30వ తేది లోపు రిజర్వేషన్ చేసుకునే ప్రయాణికులకు ఈ 10 శాతం రాయితీ వర్తించనుంది. రిజర్వేషన్ సదుపాయమున్న అన్ని సర్వీసుల్లో ఈ రాయితీ అమల్లో ఉంటుందని పేర్కొంది. తెలంగాణలో దసరా, బతుక్మమ్మలు పెద్ద పండుగలు కాగా, ఈ పర్వదినాలకు హైదరాబాద్ వసూలు పెద్దఎత్తున సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు 10 శాతం రాయితీని ఇవ్వాలని సంస్థ నిర్ణయించింది. దసరా పండుగ సెలవుల సమయంలో 15 రోజులు మాత్రమే ఈ రాయితీ అమల్లో ఉంటుంది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కొరకు సంస్థ అధికారిక వెబ్ సైట్ www.tsrtconline.in లో సంప్రదించాలని టీఎస్ఆర్టీసీ అధికారులు సూచించారు.

Show More

Jagan Reddy

Nigha 24 is the best news portal in Hyderabad maintained by Jagan Reddy, a responsible News Reporter, who is serving the nation by empowering all kinds of people with his writings and bringing the revolution in peoples with his literature.

4 Comments

  1. We are delighted to announce 📣 the unveiling of our brand-new website, which offers useful details on how to watch the eagerly awaited Mosconi Cup 2023 livestream. 🎯 Detailed instructions on how to view the live stream are available, guaranteeing that you never miss any moment of the exciting battle.

  2. Our brand-new website, which is dedicated to the SCOTTIES TOURNAMENT OF HEARTS, just launched reccently. You’ll find everything you need to remain up to date with the competition, from team profiles to match highlights. Don’t forget to tell your devoted friends about the website, and be sure to check back frequently for interesting updates, interviews, and other content.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button

Adblock Detected

We have detected ad blocker on your Browser. Please allow us on for smoother experience. We work hard to deliver the content to you without any cost. Please support us.