
శేరిలింగంపల్లి, నిఘా24: శేరిలింగంపల్లి మాజీ కార్పొరేటర్, టిఆర్ఎస్ పార్టీ నాయకులు నీలం రవీందర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. శేరిలింగంపల్లి పరిధిలోని రవీందర్ ముదిరాజ్ సన్నిహితులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎన్ఆర్ఎం యువజన సభ్యులు భారీ ఎత్తున తరలివచ్చి రవీందర్ ముదిరాజ్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సన్నిహితులు తీసుకువచ్చిన భారీ కేక్ ను రవీందర్ ముదిరాజ్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. అంతకుముందు రవీందర్ ముదిరాజ్ కు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రవీందర్ ముదిరాజ్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సన్నిహితులు, కొండాపూర్ డివిజన్ ప్రజల మధ్య పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొండాపూర్ డివిజన్ ప్రజలు తనపై చూపిస్తున్న ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు.ప్రజా సంక్షేమమే తన ధ్యేయమని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఎల్లప్పుడు ముందుంటానని పేర్కొన్నారు.

జన్మదిన వేడుకల్లో మిద్దెల మల్లారెడ్డి, రవీందర్ యాదవ్, సంగారెడ్డి, రవీందర్ ముదిరాజ్, గొడుగు సత్యనారాయణ ముదిరాజ్, రాఘవేంద్ర చారి, సూరేష్, శ్రీనివాస్ ముదిరాజ్, దేవేందర్, వెంకీ కుమార్, ఈశ్వర్ రాజ్, గొడుగు నవీన్, నరేష్ ముదిరాజ్, వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
