
హైదరాబాద్, నిఘా 24 : గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేశారు. మొత్తం 105 మందితో మొదటి జాబితాను పార్టీ అగ్ర నాయకత్వం బుధవారం రాత్రి విడుదల చేసింది. ఇందులో శేరిలింగంపల్లికి చెందిన పలువురికి చోటు దక్కింది. మొదటి జాబితాలో పలువురు సిట్టింగ్ కార్పొరేటర్లకు చోటు దక్కలేదు. శేరిలింగంపల్లి పరిధిలో ఇద్దరు సిట్టింగ్ కార్పొరేటర్ల కు ప్రస్తుత జాబితాలో చోటు దక్కలేదు. మొదటి జాబితాలో శేరిలింగంపల్లి జంట సర్కిళ్ల పరిధిలో కార్పొరేటర్ అభ్యర్థులు..
కొండాపూర్ – హమీద్ పటేల్
గచ్చిబౌలి – కె.సాయిబాబా
మాదాపూర్ – జగదీశ్వర్ గౌడ్
హాఫిజ్ పెట్ – పూజితా గౌడ్
మియపూర్ – ఉప్పలపాటి శ్రీకాంత్
మొదటి జాబితాలో శేరిలింగంపల్లి, చందనగర్ సిట్టింగ్ కార్పొరేటర్లకు చోటు దక్కలేదు.