
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కారిడార్ లో చేపడుతున్న టీ హబ్-2 ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్ కేంద్రంగా నిలువబోతుందని తెలంగాణ ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. టీ హబ్-2ను ఈ సంవత్సరం చివర్లో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ ట్రిపుల్ ఐటీలో శనివారం జరిగిన స్టార్టప్ కాంక్లేవ్ లో పాల్గొన్న జయేష్ రంజన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న టీ హబ్ కంటే ఐదింతలు పెద్దగా టీ హబ్-2 రూపుదిద్దుకుంటుందని తెలిపారు. టీ హబ్-2 కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని తెలిపారు. స్టార్టప్ నిధిని సైతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో దేశంలోని 23 నగరాల నుంచి వచ్చిన ప్రభుత్వ అధికారులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
9 Comments