
హైదరాబాద్ : వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు అందజేసే నార్త్ ఢిల్లీ కల్చరల్ అకాడమీ జాతీయ పురస్కారాన్ని నగరంలోని శేరిలింగంపల్లి మండలానికి చెందిన విద్యా టాలెంట్ స్కూల్ కరెస్పాండంట్ పొన్నాడ త్రిమూర్తులు అందుకున్నారు. నగరంలోని త్యాగరాయ గాన సభలో జరిగిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె. రోశయ్య చేతుల మీదుగా అందుకున్నారు. విద్యా రంగంలో లయన్ త్రిమూర్తులు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారాన్ని అందజేశారు. కార్యక్రమంలో ఐఏఎస్ ఆర్ వి.చంద్రవధన్, విజయ్ కుమార్, బింగి నరేందర్ గౌడ్, విద్యా టాలెంట్ స్కూల్ హెడ్ మాస్టర్ రమేష్, ఇంచార్జ్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు.