
తెలుగు బిగ్‌బాస్ షో-3 అనుకున్న టైమ్‌కే ప్రారంభమైంది. ఎన్నో వివాదాలు.. మరెన్నో పిటిషన్లు.. ఇంకెన్నో వార్నింగ్‌లు, నిరసనల మధ్య షో ప్రారంభమైంది. ఈ షోను ఆపాలని ఆఖరికి ఓయూ విద్యార్థులు సైతం అక్కినేని నాగార్జున ఇంటి ముందు ధర్నా చేసిన విషయం విదితమే. అయితే ఆదివారం రాత్రి 9గంటలకు సరిగ్గా షో ప్రారంభమైంది. ఈ సందర్భంగా హోస్ట్ నాగ్.. కంటెస్టెంట్లను పరిచయం చేసి లోపలికి పంపించారు.
సావిత్రి ఫస్ట్ కంటెస్టెంట్…
బిగ్‌బాస్ హౌస్‌లోకి మొదటి కంటెస్టెంట్‌గా తీన్మార్ వార్తల సావిత్రి అడుగుపెట్టారు. సావిత్రిని అక్కినేని నాగ్ మొదటి కంటెస్టెంట్‌గా పరిచయం చేశారు. ఇదిలా ఉంటే.. సావిత్రి ఓ ప్రముఖ చానెల్‌లో తీన్మార్ వార్తల ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అయిన సంగతి తెలిసిందే.
రెండో కంటెస్టెంట్‌గా రవికృష్ణ…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ రవికృష్ణ అడుగుపెట్టాడు. టాప్ సీరియల్ అయిన ‘మొగలిరేకులు’తో పాటు పలు సీరియల్స్‌లో ఈయన నటించి మెప్పించాడు. తెలుగు సీరియల్ ప్రియులకు రవికృష్ణను కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు.
మూడో కంటెస్టెంట్‌గా అశురెడ్డి…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి మూడో కంటెస్టెంట్‌గా అశురెడ్డి అడుగుపెట్టారు. డబ్ స్మాష్‌తో సమంత డూప్‌గా పేరు తెచ్చుకుని సోషల్ మీడియాలో అశురెడ్డి ఫేమస్ అయింది.
నాలుగో కంటెస్టెంట్‌గా జాఫర్
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి నాలుగో కంటెస్టెంట్‌గా ప్రముఖ న్యూస్ యాంకర్ జాఫర్ అడుగుపెట్టారు. ఈయన పూర్తిపేరు జాఫర్ బాబు. వార్తా ప్రియులకు, న్యూస్ చానెల్స్ చూసేవారికి ప్రత్యేకించి మరీ ఈయన గురించి చెప్పనక్కర్లేదు. ఓ టాప్ న్యూస్ చానెల్‌లో జాఫర్ యాంకర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు ఎంతోమంది రాజకీయ, సినీ ప్రముఖులను ఈయన ఇంటర్వ్యూలు చేయడమే కాకుండా.. కాంట్రవర్సీకి కేరాఫ్‌గా పేరుగాంచారు.
ఐదో కంటెస్టెంట్‌గా హిమజా…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఐదో కంటెస్టెంట్‌గా మలిరెడ్డి హిమజా రెడ్డి అడుగుపెట్టారు. ఈమె ఏపీకి చెందిన గుంటూరు జిల్లా వాసి. ఈమె పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా హిమజా నటించి మెప్పించారు. అంతేకాదు.. కిషోర్ తిరుమల సినిమాలతో ఈమె ఫేమస్ అయ్యింది. ఈమె ఎక్కువగా సినిమాల్లో హీరోయిన్స్‌కు ఫ్రెండ్‌తో పాటు పలు పాత్రల్లో నటించారు.
ఆరో కంటెస్టెంట్‌గా సింగర్ రాహుల్…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఆరో కంటెస్టెంట్‌గా తెలంగాణ పాపులర్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ అడుగుపెట్టారు. కాగా ఈయన ధూల్‌పేట రాజాగా.. తెలంగాణ రాక్‌స్టార్‌గా పేరుగాంచాడు. మరీ ముఖ్యంగా.. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, సమంత నటీనటులుగా సుకుమార్ తెరకెక్కించిన ‘రంగస్థలం’ సినిమాలో ‘రంగా రంగా రంగస్థలాన…’ అనే పాటను పాడి ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు.
ఏడో కంటెస్టెంట్‌గా రోహిణి…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఏడో కంటెస్టెంట్‌గా పాపులర్ రోహిణి అడుగుపెట్టారు. ఈమె తెలుగు సీరియల్స్‌లో కామెడీ పాత్రల్లో నటించి అందరి మనసులు గెలుచుకున్నారు. అంతేకాదు జబర్దస్త్ షోలో కూడా ఈమె నటించారు.
ఎనిమిదో కంటెస్టెంట్‌గా కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎనిమిదవ కంటెస్టెంట్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అడుగుపెట్టారు. ఈయన్ను సినీ ప్రియులకు.. మరీ ముఖ్యుంగా డ్యాన్స్‌ను ఇష్టపడేవారికి పరిచయం చేయనక్కర్లేదు. ఈయన ఎక్కువగా కోలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరైన ధనుష్ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు.
9వ కంటెస్టెంట్‌గా నటి పునర్వి…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి తొమ్మిదవ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ నటి పునర్వి భూపాలం అడుగుపెట్టారు. పునర్వి ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అంతేకాదు.. ఈమె తెలుగమ్మాయి కావడం విశేషమని చెప్పుకోవచ్చు. ఉయ్యాల జంపాల సినిమాతో పాటు పలు చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు.
10వ కంటెస్టెంట్‌గా నటి హేమ…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి పదవ కంటెస్టెంట్‌గా టాలీవుడ్ సీనియర్ నటి హేమ అడుగుపెట్టారు. కాగా ఈమె రెండు, మూడు తరాల హీరోల సినిమాల్లో పలుపాత్రల్లో నటించి మెప్పించారు. అంతేకాదు.. బిగ్‌బాస్ షోపై వివాదం తలెత్తినప్పుడు మొట్టమొదటిసారి పెదవి విప్పిన నటి కూడా ఈమె. షో గురించి అనవసర రాద్ధాంతం చేస్తే బాగోదని.. నాగ్ చాలా మంచి వ్యక్తి.. పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి అని హేమ ప్రశంసల వర్షం కురిపించారు.
11వ కంటెస్టెంట్‌గా అలీ రెజా…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి 11వ కంటెస్టెంట్‌గా తెలుగు సీరియల్ నటుడు అలీ రెజా అడుగుపెట్టారు. ఈయన సీరియల్స్, సినిమాలతో పాటు మోడలింగ్‌లోనూ పేరు తెచ్చుకున్నారు. అంతేకాదు పలు సీరియల్స్‌లో అలీరెజా నటించి మెప్పించి మంచి పేరు సంపాదించుకున్నారు.
12వ కంటెస్టెంట్‌గా ఫన్‌బకెట్ మహేశ్…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి 12వ కంటెస్టెంట్‌గా ఫన్‌బకెట్ కామెడీతో ఫేమస్ అయిన మహేశ్ విట్టా అడుగుపెట్టారు. కాగా ఈయన తెలుగులో పలు కామెడీ షోలతో పాటు ఫన్‌బకెట్‌తో బాగా పాపులర్ అయ్యారు. కామెడీ షోలతో పాటు.. పలు సినిమాల్లో సైతం నటించి మెప్పించాడు. మహేశ్ సొంతూరు ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. మరీ ముఖ్యంగా కమెడియన్‌గా చిత్తూరు, కడప యాసలో కడుపుబ్బ నవ్విస్తుంటాడు. నేచురల్ స్టార్ నాని నటించిన ‘కృష్ణార్జున యుద్దం’తో మహేశ్ సినిమాల్లో అడుగుపెట్టారు.
13వ కంటెస్టెంట్‌గా శ్రీముఖి…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి 13వ కంటెస్టెంట్‌గా పటాస్ కామెడీ షో యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టారు. కాగా ఈమె తెలుగులో పలు కామెడీ షోలతో పాపులర్ అయ్యారు. కామెడీ షోలతో పాటు.. పలు సినిమాల్లో సైతం నటించి మెప్పించారు.
14,15వ కంటెస్టెంట్ లుగా వరుణ్ సందేశ్, వితిక షేరు దంపతులు…
తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లోకి 14వ కంటెస్టెంట్‌గా ప్రముఖ సినీ యాక్టర్ వరుణ్ సందేశ్ అడుగుపెట్టారు. కాగా ఈయన తెలుగులో పలు సినిమాలతో పాపులర్ అయ్యారు. కాగా వితిక షేరు ఒక సింగర్ గా సినీరంగానికి పరిచయం అయి వరుణ్ సందేశ్ను ప్రేమ వివాహం చేసుకుంది.
