
హైదరాబాద్, నిఘా24: తెలంగాణ రాష్ట్రం రెవెన్యూ విభాగంలో పలువురు డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయ్యారు. స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు బదిలీ అయిన వారిలో ఉన్నారు. మొత్తం 10మంది అధికారులను స్థానచలనం చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో పలు శాఖల్లో పనిచేస్తున్న డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవో లు ఆర్ఎస్.చిత్రు, జె.రాజేశ్వర్, అశోక్ కుమార్, ఎల్.రమేష్,టి. రవి, గోపిరామ్, కె. రాజేశ్వర్, రాజేంద్రకుమార్, ప్రసూనాంభ, మోహన్ రావు, లింగ్యా నాయక్ ఉన్నారు.
