
హైదరాబాద్ : తెలంగాణ సచివాలయం భవనాల కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. తెలంగాణ పాత సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్పష్టతనిచ్చిన నేపథ్యంలో అధికారులు కూల్చివేత పనులు మెుదలుపెట్టారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి సచివాలయం భవనాల కూల్చివేత పనులు చకాచకా సాగుతున్నాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య సచివాలయం భవనాల కూల్చివేత పనులు నడుస్తున్నాయి. ఆటు వైపు వెళ్లే మార్గాలన్నీ పోలీసులు మూసివేశారు. వాహనాలతో సహా ఎవరినీ అధికారులు అనుమతించట్లేదు. కూల్చివేత పనులను ఉన్నతాధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.
2 Comments