
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో 212 మంది తహశీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు తెలంగాణలో పలువురు తహశీల్దార్లను బదిలీ చేశారు. కాగా ఎన్నికలు ముగిసినా పలు కారణాలతో తహశీల్దార్లను వారి పూర్వ స్థానాలకు బదిలీ చేయలేదు. దీనిపై పలువురు ఉద్యోగులు పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. ఈ మేరకు సీసీఎల్ఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ 212 మంది జోన్ 6లో పనిచేస్తున్న తహశీల్దార్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు.




