
హైదరాబాద్ : తెలంగాణలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సీహెచ్. మల్లారెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న మల్లారెడ్డి పరీక్షలు చేసుకోగా పాజిటివ్ వచ్చింది. దీంతో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న మల్లారెడ్డి డాక్టర్ల సూచన మేరకు చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే డిప్యూటీ సిఎం, డిప్యూటీ స్పీకర్, పలువురు ఎమ్మెల్యేలు, హైదరాబాద్ మేయర్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.