
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో బుధవారం మరో 7 కొత్త కేసులు నమోదయ్యాయి. బుధవారం నమోదైన కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 1016కు చేరింది. వీరిలో 409 మంది చికిత్స తీసుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. బుధవారం సైతం 35 మంది విజయవంతంగా చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 582 అక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 25మంది మృతిచెందారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. రాష్ట్రంలో మొత్తం 11 జిల్లాలు ఒక్క ఆక్టివ్ కేసు కూడా లేకుండా జీరో కేస్ జిల్లాలుగా నమోదయ్యాయి.
9 Comments