
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ ఆలీకి కరోనా పాజిటీవ్ వచ్చింది. గత రెండు రోజులుగా కోవిడ్ లక్షణాలతో ఉన్న ఆయనకు పరీక్షలు నిర్వహించగా పాజిటీవ్ గా తేలింది. గతంలో హోంమంత్రి అంగరక్షకులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారిన పడగా, తాజాగా హోంమంత్రి సైతం మహమ్మారి బారిన పడడం సంచలనంగా మారింది. ప్రస్తుతం హోంమంత్రి మహమూద్ అలీ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.