
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నూతన సచివాలయం కోసం హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వనికి హైకోర్టు లో ఊరట లభించింది. సచివాలయంలో కూల్చివేతలపై ధాఖలు చేసిన పిటీషన్లను హైకోర్టు కొట్టివేసింది. క్యాబినెట్ నిర్ణయాన్ని తప్పు బట్టలేమని పేర్కొంది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, సచివాలయం కూల్చివేయ వద్దని వేసిన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. హైకోర్టు తీర్పు తో నూతన సచివాలయ నిర్మాణానికి అడ్డంకి తొలగినట్లయింది. ప్రస్తుతం ఉన్న సచివాలయంలో సరైన సదుపాయాలు లేవని, ఉన్న భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని ప్రభుత్వ వాదనతో హైకోర్టు ఏకీభవించింది.