
హైదరాబాద్, నిఘా 24: తెలంగాణ వర్తక వ్యాపారులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వేళల్లో షాపులు తెరుచుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో ని షాపులు ఇకపై 24 గంటల పాటు తెరుచుకునే అవకాశం ఉంటుంది. 24 గంటల పాటు షాపులు తెరిచేందుకు ఏడాదికి రూ.10వేలు అదనంగా చెల్లించాలని నిబంధన పెట్టారు. కాగా ఈ నిర్ణయం ఎలాంటి షాపులకు వర్తిస్తోంది అనే వివరాలు తెలియాల్సి ఉంది.