
హైదరాబాద్, నిఘా24: తెలంగాణలోని జిల్లా అడిషనల్ కలెక్టర్లకు ప్రభుత్వం కొత్త కియా కార్లను మంజూరు చేసింది. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాల అదనపు కలెక్టర్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త కియా కార్నివాల్ వాహనాలు కేటాయించింది. రవాణా శాఖ ద్వారా కొనుగోలు చేసిన ఈ వాహనాలను ఆదివారం ప్రగతి భవన్‌కు తీసుకురాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ తో పల్లె, పట్టణ ప్రగతి సమీక్ష సమావేశం అనంతరం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.

సమావేశం అనంతరం ఈ వాహనాలను ముఖ్యమంత్రి సైతం పరిశీలించారు. కాగా, ప్రభుత్వం అడిషనల్ కలెక్టర్లకు అందజేసిన ఒక్కో కియా కార్నివాల్ కారు ధర రూ.25 లక్షల వరకు ఉంటుందని తెలుస్తుంది.