
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో 879 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 652 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9553కు చేరింది. సోమవారం మరో ముగ్గురు మృత్యువాత పడగా, ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 220కి చేరింది. కాగా రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఆక్టివ్ కేసులు 5109 ఉండగా, మరో 4224 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.