
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత తగ్గడంలేదు. ఆదివారం కొత్తగా మరో 1590 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 23,902కు చేరుకుంది. మరో 7గురు మహమ్మారి కారణంగా మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 295కు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ లో ఆదివారం 1277కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 10,904 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 12,703మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.