
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు దూసుకుపోతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. సోమవారం రాష్ట్రంలో 872 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 713 మంది కరోనా బారిన పడ్డారు. తెలంగాణలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8674కు చేరింది. ఇందులో 4005మంది కొలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సోమవారం మరో7గురు మృత్యువాత పడగా, ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 217కు చేరింది. కాగా రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత ఆందోళనకు గురిచేస్తోంది. సోమవారం 3189 మందికి టెస్టులు చేయగా 872 మందికి పాజిటీవ్ గా తేలింది.