
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా జోరు మరోసారి పెరుగుతుంది. సోమవారం కొత్తగా 1550 కేసులు నమోదయ్యాయి. మరో 9 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 36,221కి చేరుకుంది. ఇందులో 23,679మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12,178 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 365 మృతి చెందారు. గ్రేటర్ లో కొత్తగా 926 కేసులు నమోదయ్యాయి.