
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కొద్దిగా తగ్గుముఖం పెట్టినట్టు కనిపిస్తుంది. శుక్రవారం రాష్ట్రంలో 1278 కేసులు నమోదయ్యాయి. మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 32,224కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 12680 ఆక్టివ్ కేసులు ఉన్నాయి. శుక్రవారం మరో 1013 మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 19205కు చేరుకుంది. కాగా శుక్రవారం మరో 8మంది మహమ్మారి కారణంగా మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 339కి చేరుకుంది.