
హైదరాబాద్, నిఘా24: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 1లక్ష దాటింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,01,865 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత కొద్ది రోజులుగా కేసుల సంఖ్య తగ్గుముఖం పెట్టినట్టు కనిపించగా, కొత్తగా రికార్డు స్థాయిలో కేసులు నమోదు కావడం గమనార్హం. శనివారం విడుదల చేసిన బులిటెన్ లో కొత్తగా 2474 కేసులు నమోదయ్యాయి. మరో 7గురు మహమ్మారి కారణంగా మృతిచెందగా, మొత్తం మృతుల సంఖ్య 744కు చేరింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను పెంచడంతో మొత్తం పరీక్షల సంఖ్య 8.91లక్షలకు చేరుకుంది. కొత్తగా 1,768మంది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, రాష్ట్రంలో మొత్తం రికవరీ సంఖ్య 78,735కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,386 ఆక్టివ్ కేసులు ఉండగా, మరో 15,931మంది హోం క్వారంటైన్ లో ఉన్నారు.
RSD https://bg.realsexdoll.com