
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని కరోనా మహమ్మారి కాటేస్తుంది. రోజురోజుకు మహమ్మారి విస్తరిస్తుండడంతో రాష్ట్రంలో పాజిటీవ్ కేసుల సంఖ్య 50వేల మార్కును దాటింది. పాజిటీవ్ కేసులతో పాటు భారీగా మరణాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో మొదటి కేసు నమోదైన తరువాత దాదాపు 4 నెలల్లో 10వేల మార్కును చేరుకోగా, అనంతరం వారానికో 10వేల చొప్పున కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా గత 15 రోజుల్లోనే 20వేల కేసులు నమోదు కావడం కలవర పెడుతుంది. దీంతో పాటు గతంలో గ్రేటర్ హైదరాబాద్, దానిచుట్టు ప్రక్కల ప్రాంతాలకే పరిమితమైన మహమ్మారి నేడు రాష్ట్రం మొత్తం విస్తరిస్తోంది. గతకొన్ని రోజులుగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 2వ తేదీన మొదటి కేసు నమోదుకాగా, జూలై 23న 50వేల కు చేరుకుంది. రాష్ట్రంలో భారీగా కేసులు నమోదవుతున్నా అదే స్థాయిలో రికవరీ ఉండడం కొంత ఉరతనిచ్చే అంశం. మొత్తం నమోదైన కేసుల్లో దాదాపు 75శాతం రికవరీ జరగడం విశేషం. రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్టివ్ కేసులు తక్కువగానే ఉన్నా, మారుమూల ప్రాంతాలకు విస్తరిస్తుండడం, మరణాలు భారీగానే చోటుచేసుకుంటుండడం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో మొదటి కేసు నమోదైన దగ్గరి నుంచి ఇప్పటి వరకు కేసుల వివరాలను ఒకసారి పరిశీస్తే…
▶️మార్చ్ 2న మొదటి కేసు నమోదు…
▶️జూన్ 24వ తేదీన(దాదాపు 110 రోజులకు) 10వేలు దాటిన కేసులు…
▶️జూలై 3కు 20వేల మార్కును దాటిన మహమ్మారి(10నుంచి 20వేలకు 10రోజుల సమయం)…
▶️జూలై 9న 30వేలకు చేరుకున్న కరోనా(కేవలం 6రోజుల్లోనే 10వేల కేసులు)…
▶️మరో వారం రోజులు అనగా జూలై 16 నాటికి 40వేల మార్కును చేరుకున్న మహమ్మారి…
▶️మరో వారం రోజుల్లో 10వేల కేసులతో జూలై 23న 50వేల మార్కును దాటిన పాజిటివ్ కేసులు…