
గచ్చిబౌలి, నిఘా 24: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను గచ్చిబౌలి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి కేసీఆర్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో గల స్పర్శ్ హోస్పైస్ క్యాన్సర్ ఆసుపత్రిలో క్యాన్సర్ బాధితులకు పాలు, పండ్లు మరియు పండ్ల రసాల పాకెట్స్, ఎనర్జీ డ్రింక్స్ ను సాయిబాబా ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నిర్వాహకులతో చర్చించిన సాయిబాబా ఆసుపత్రికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకును ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రతి సంవత్సరం ఒక కార్యక్రమం చేపడుతూ సామాజిక సేవల్లో పాల్గొంటున్నామని తెలిపారు.

గత సంవత్సరం హరితహారం నిర్వహించగా, ఈ సంవత్సరం ఆసుపత్రిలో రోగులకు సహాయ సహకారాలు, రక్తదాన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, ముఖ్యమంత్రి గా రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారని తెలిపారు. అహర్నిశలు ప్రజా సంక్షేమం కోసం పాటుపడే ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను క్యాన్సర్ బాధితులకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన డివిజన్ కార్యకర్తలను ఆయన అభినందించారు. క్యాన్సర్ బాధితుల చివరి రోజుల్లో వారికి స్వాంతన కలిగిస్తున్న స్పర్శ్ హోస్పైస్ సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో కొమిరిశెట్టి భావన, స్పర్శ్ సెంటర్ హెడ్ శశిధర్, అడ్మిన్ డాక్టర్ సరదా, గచ్చిబౌలి డివిజన్ నాయకులు రాజు నాయక్, అంజమ్మ, రాజు ముదిరాజ్, నరేష్, సత్యనారయణ, గోవింద్, రమేష్ గౌడ, సంపత్ కుమార్, జగదీష్, వెంకటేష్ ముదిరాజ్, సుధీర్, నందిరాజు, అరుణ కుమారి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
