
శేరిలింగంపల్లి, నిఘా 24: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలను శుక్రవారం గచ్చిబౌలి డివిజన్ బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో గల బీఆర్ఎస్ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా భారీ కేక్ ను కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా కేక్ ను కట్ చేసి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సాయిబాబా మాట్లాడుతూ సంక్షేమ పథకాల సృష్టికర్తగా బంగారు తెలంగాణకు బాటలు వేసిన జాతిపిత కేసీఆర్ అని అన్నారు.

నేడు తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. దేశ భవితకు మార్చేందుకు నడుంబిగించిన కేసీఆర్ భావి భారత నిర్మాతగా మారనున్నారని అన్నారు. నేడు దేశ ప్రజలు, రైతులు, యువత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలిపారు. ఈ వేడుకల్లో గచ్చిబౌలి డివిజన్ బిఆర్ఎస్ నాయకులు రాగం జంగయ్య యాదవ్, దారుగుపల్లి నరేష్, అంజమ్మ , శంకరి రాజు ముదిరాజ్, నాగపురి అశోక్ యాదవ్, రాచులూరి జగదీశ్, చెన్నం రాజు, అక్బర్, రమేష్ గౌడ్, గోవింద్, నారాయణ, భిక్షపతి, శ్రీనివాస్, సుధీర్, భాస్కర్ రెడ్డి, ఫయాజ్, అలీం, ప్రభాకర్, ఖాదర్ ఖాన్, రాణి, సుగుణ, బాలమణి, మాధవి, అజ్మాత్ తదితరులు పాల్గొన్నారు.
