
హైదరాబాద్ : చందానగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం కార్యాలయాన్ని చందనగర్ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డితో కలిసి శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తుందన్నారు. అనంతరం కార్మికులకు ఐడి కార్డ్స్ ను అందించడంతో పాటు ఇటీవల ప్రమాదాలకు గురైన కార్మికుల కుటుంబాలకు కార్మిక సంక్షేమం సంఘం తరుపున చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు, టిఆర్ఏస్ నాయకులు పాల్గొన్నారు.