
హైదరాబాద్ : గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ ను సోమవారం ఎక్సపర్ట్ టెక్నికల్ కమిటీ పరిశీలించింది. ఈ ఫ్లై ఓవర్ మీద వరుస ప్రమాదాలు చోటుచేసుకోవడం, నిర్మాణ లోపాలపై పలువురు సందేహలు వ్యక్తం చేస్తుండడంతో సోమవారం ప్రభుత్వం నలుగురు సభ్యులు ప్రొ. నాగభూషణంరావు, టీ ఏస్. రెడ్డి, శ్రీనివాస కుమార్, ప్రదీప్ రెడ్డి లతో ఎక్సపర్ట్ టెక్నికల్ కమిటీని నియమించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కమిటీ ఫ్లై ఓవర్ ను పరిశీలించారు.