
హైదరాబాద్, నిఘా 24 : బోగస్ ఓట్ల తొలగింపు కోసం రాష్ట్రంలో ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో ఓటరు కార్డుతో ఆధార్ అనుసంధానం ప్రారంభం అవుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లోని సీఈవో కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటరు గుర్తింపు కార్డులతో ఆధార్ అనుసంధానం ఐచ్ఛికమని తెలిపారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండి, ఓటర్ల ఆధార్ వివరాలు బహిర్గతం కాకుండా జాగ్రతలు తీసుకోవాలని సూచించారు. ఆగస్టు 1 నుంచి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ కూడా చేపడుతున్నట్టు చెప్పారు. ఇప్పటికే 119 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఫొటో సారూప్యత ఉన్న 10,25,987 డబుల్ ఎంట్రీలను తొలగించామన్నారు.