
శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని సుదర్శన్ నగర్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ శనివారం పర్యటించారు. కాలనీలో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలు చోట్ల యూజీడి పైపులైన్, మంజీరా మంచినీటి పనులు చేపట్టాల్సి ఉందని స్థానికులు కోరారు. ఓపెన్ నాలాకి ప్రవహించే మురుగు కాలువకు స్లాబ్ వేసేలా చూడాలని తెలిపారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కాలనీ అభివృద్ధి కి ఎల్లవేళలా కృషి చేస్తున్నామని, ప్రజలకు మౌలిక వసతుల కల్పన కోసం పాటుపడుతున్నామని అన్నారు. కార్పొరేటర్ తో పాటు అధికారులు, స్థానికులు పాల్గొన్నారు.