
హైదరాబాద్: క్యాట్ కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి పరీక్షలకు హాజరుకాలేదని తండ్రి మందలించాడు. మనస్థాపం చెందిన కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా ద్వారాకానగర్ కు చెందిన రతన్ లాల్ కుమారుడు శ్రీచరణ్ రాజ్(20) క్యాట్ కోచింగ్ కోసం నగరానికి వచ్చాడు. గచ్చిబౌలి కావ్యశ్రీ హాస్టల్ లో ఉంటూ మాదాపూర్ టైమ్ ఇనిస్టిట్యూట్ లో శిక్షణ పొందుతున్నాడు. కాగా ఇనిస్టిట్యూట్ లో నిర్వహించిన 20 అన్ లైన్ పరీక్షలకు శ్రీచరణ్ హాజరు కాకపోవడంతో తండ్రి మందలించాడు. దీంతో మనస్థాపం చెందిన శ్రీచరణ్ తాను ఉంటున్న హాస్టల్ భవనం పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
