
హైదరాబాద్, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని గచ్చిబౌలి డివిజన్ లో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని డివిజన్ లో వాడవాడలా మండపాలను ఏర్పాటు చేసి, గణనాథులను ప్రతిష్టించారు. డివిజన్ పరిధిలోని ఖాజాగూడలో ఏర్పాటు చేసిన గణపయ్యకు గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ప్రత్యేక పూజలు చేశారు. ఖాజాగూడలోని పోచమ్మ గుడి వద్ద శ్రీ మల్లికార్జున భక్త సమాజం ఆధ్వర్యంలో ప్రతిష్టించిన గణనాధుని పూజల్లో సాయిబాబా పాల్గొన్నారు.

ఖాజాగూడ గ్రామంలో సాయిబాబా కుటుంబ సభ్యుల కొమిరిశెట్టి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాధుడికి మాజీ కార్పొరేటర్ సాయిబాబా కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రజలందరూ భక్తిశ్రద్దలతో, ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రత్యేక పూజల్లో కొమిరిశెట్టి ఫౌండేషన్ సభ్యులు, ఖాజాగూడ గ్రామస్తులు పాల్గొన్నారు.