
సైబరాబాద్: క్యూనెట్ సంస్థ మోసానికి బలైన ఓ సాప్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. క్యూనెట్ సంస్థ మోసంతో ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న సాప్ట్‌వేర్ ఉద్యోగి మాదాపూర్ లో ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు. శ్రీకాకుళంకు చెందిన అరవింద్(31) అసెంచర్ లో సాప్ట్‌వేర్ ఉద్యోగిగ పని చేస్తున్నాడు. అరవింద్ క్యూనెట్ స్కాంలో సుమారు 20 లక్షల రూపాయల వరకు పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలో బుధవారం అరవింద్ మాదాపూర్ లో తాను ఉంటున్న ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.
3 Comments