
హైదరాబాద్ : తనను కలిసేందుకు వచ్చిన వారితో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మాట్లాడిన మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్లను కూడా పంపించం అంటూ ఎమ్మెల్యే గాంధీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ట్రోల్స్, కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ ప్రసంగించిన ఓ వీడియో తాజాగా బయటకు వచ్చింది. అందులో ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ సీఏఏ బిల్లుకు తాము వ్యతిరేకమని, సభ పెట్టి, అసెంబ్లీలో తీర్మానం చేస్తామని ముఖ్యమంత్రి కెసీఆర్ చెప్పారని అన్నారు. అంతటితో ఆగకుండా “మీ వద్ద ఏ గుర్తింపు కార్డు లేకపోయినా, పాకిస్థాన్ నుంచి వచ్చినా వెనక్కు పంపించం, మీతో పాటు మేము వస్తాం” అంటూ ఎమ్మెల్యే గాంధీ వ్యాఖ్యానించారు.దింతో పాటు సీఏఏకు అనుకూలంగా ఎవరైనా ప్రచారం చేస్తే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యలను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో ఎమ్మెల్యే గాంధీ వ్యాఖ్యలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ట్రోల్స్, కామెంట్స్ తో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
3 Comments