
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరేకపూడి గాంధీ ఆదివారం రాయదుర్గంలో ప్రచారంతో హోరెత్తించారు. గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి రాయదుర్గంలోని పలు బస్తీల్లో పాదయాత్ర నిర్వహించి ఇంటింటి ప్రచారం చేపట్టారు. అంతకుముందు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అరేకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో గత 9ఏళ్లలో జరిగిన అభివృద్ధిని చూసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని సూచించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మాజీ కార్పొరేటర్ సాయిబాబా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు సూచించారు. అభివృద్ధి అంటే తెలంగాణ, తెలంగాణ అంటే బిఆర్ఎస్ అని నేడు ప్రజలు భావిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి అరేకపూడి గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు శేరిలింగంపల్లి ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు.

ప్రచారంలో గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షుడు రాజు నాయక్, మాజీ అధ్యక్షుడు చెన్నం రాజు, గ్రంధాలయ చైర్మన్ గణేష్ ముదిరాజ్, శ్రీను పటేల్, నాయకులు తూడి ప్రవీణ్, ఎర్రగుడ్ల రాజు యాదవ్, లడ్డు ముదిరాజ్, సంపత్, దేవేందర్ ముదిరాజ్, వార్డ్ మెంబర్లు రాగం జంగయ్య యాదవ్, సతీష్ ముదిరాజ్, నరేష్, అంజమ్మ, ఏరియా కమిటీ సభ్యులు శంకరి రాజు ముదిరాజ్, జగదీశ్, అశోక్ యాదవ్, నాయకులు నారాయణ, రమేష్ గౌడ్, గోవింద్, జగదీశ్, భికపతి, సలావుద్దీన్, అక్బర్, రాజేందర్, నాగేష్, ఖాదర్ ఖాన్, నాగేష్, ఇమ్రాన్, రవీందర్, సుదర్శన్ లతో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Dear immortals, I need some wow gold inspiration to create.