
శేరిలింగంపల్లి, నిఘా24 : శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా సిట్టింగ్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు. గురువారం తారానగర్ తుల్జాభవాని ఆలయం నుంచి భారీ ఊరేగింపుగా వచ్చి నామినేషన్ వేశారు. కాగా రాగం నాగేందర్ కు ఇప్పటి వరకు పార్టీ టికెట్ విషయంలో అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. టిఆర్ఎస్ పార్టీ మొదటి విడత జాబితా లో సిట్టింగ్ కార్పోరేటర్ రాగం నాగేందర్ కు చోటు దక్కలేదు. గురువారం వరకు శేరిలింగంపల్లి టిఆర్ఎస్ పార్టీ టికెట్ విషయంలో సందిగ్ధం నెలకొంది.