
హైదరాబాద్, నిఘా 24: నగర శివారు పరిధిలోని వట్టినగులపల్లిలో గల శంకర్ హిల్స్ లేఔట్ లో ఉన్న తమ ప్లాట్లను కొంతమంది కబ్జా చేశారని యజమానులు బుధవారం గచ్చిబౌలి పోలీసులకు పిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వట్టినాగులపల్లి గ్రామం సర్వే నెంబర్ 111నుంచి 190 వరకు ఉన్న 460.6 ఎకరాల భూమిలో 1983లో లే అవుట్ చేసి 3330 ప్లాట్లు చేసి విక్రయించారని, శంకర్ హిల్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ లేఔట్ లో తాము ప్లాట్లు కొనుగోలు చేశామని అన్నారు. ఈ మధ్య ఇక్కడ భూముల ధరలు పెరగడంతో కొందరు కబ్జాదారులు అధికారుల అండతో రెవెన్యూ రికార్డులు తారుమారు చేసి తమ ప్లాట్లను కబ్జా చేశారని అన్నారు. ధరణిలోనూ కబ్జాదారుల పేర్లు రావడం రెవెన్యూ అధికారుల అవినీతికి పరాకాష్ట అని యజమానులు ఆగ్రహం వ్యక్తం చేసారు. తమ ప్లాట్లను ధరణిలో వ్యవసాయ భూములుగా మార్చి కొందరు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. ఈ విషయమై కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేసినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 3000 మంది యజమానులు భవిష్యత్తు అవసరాల కోసం ప్లాట్లు కొనుగోలు చేశారని, వారందరికి న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. బుధవారం సుమారు 200 మంది నిరసనకు దిగారు. కోర్టులో కేసు నడుస్తుండగా ఇలా చేయడం తగదని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ చేసి ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులకు న్యాయం చేయాలని అడిషనల్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేశామని అన్నారు. కార్యక్రమంలో ప్లాట్ల కొనుగోలుదారులు సంక్షేమ సంఘం కార్యదర్శి ఏవీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Dear immortals, I need some wow gold inspiration to create.