
శేరిలింగంపల్లి, నిఘా 24: శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని రాయదుర్గంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ గురువారం పాదయాత్ర చేపట్టారు. రాయదుర్గంలో వరుసగా 2వ రోజు పాదయాత్రను కొనసాగించిన ఎమ్మెల్యే గాంధీ స్థానికంగా ఉన్న గొర్రెఎన్క బస్తీ, కట్టెల బస్తీ, ఈగ బస్తీ, ఎస్సీ బస్తీ, ఏండ్ల బస్తీ, పోచమ్మ బస్తీలలో బిఅర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించడంతో పాటు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుంటూ పాదయాత్ర కొనసాగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గ అభ్యర్థిగా మరోసారి అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్టంలో మరోసారి బిఆర్ఎస్ పార్టీ విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేస్తుందని, శేరిలింగంపల్లిలో సైతం తనకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి, నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని అన్నారు. గత ఐదేళ్ళ కాలంలో నియోజకవర్గంలో 9 వేల కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామని అన్నారు.

అంతకుముందు ఉదయం గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబాతో కలిసి రాయదుర్గంలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్రను ప్రారంభించారు. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, సంతులిత , సమగ్ర అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు ఈఈ శ్రీనివాస్, డీఈ విశాలాక్షి, ఏఈ జగదీష్, గచ్చిబౌలి డివిజన్ బిఅర్ఎస్ పార్టీ నాయకులు రాజు నాయక్, మంత్రిప్రగఢ సత్యనారాయణ, దారుగుపల్లి నరేష్, సంపత్, సతీష్, రమేష్ , రవీందర్ ముదిరాజ్, అశోక్, మల్లేష్, గోవింద్, రామేశ్వరమ్మ , విజయ తదితరులు పాల్గొన్నారు.
good work MLA Gandhi