
శేరిలింగంపల్లి,నిఘా24: శేరిలింగంపల్లి మండల పరిధిలో పని చేస్తున్న జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన స్థలం విషయమై శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీకి వినతి పత్రం సమర్పించారు. శేరిలింగంపల్లి మండల పరిధిలోని నల్లగండ్ల పవిత్ర ఇంటర్నేషనల్ స్కూల్ లో క్రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జర్నలిస్టులకు ఉచిత వైద్య పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన శేరిలింగంపల్లి జర్నలిస్టులు బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రెజర్, బిఎంఐ, పల్స్ ఆక్సిజన్ లెవెల్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అస్కాని మారుతి సాగర్, టెంజూ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఇస్మాయిల్, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డిలు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి జర్నలిస్టులు దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న ఇళ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ భవన స్థలంపై రాష్ట్ర కమిటీకి వినతి పత్రం సమర్పించారు.

శేరిలింగంపల్లి జర్నలిస్టులకు 2007లో కుత్బుల్లాపూర్ మండలం బోరంపేట గ్రామ సర్వే నెంబరు 576లో ఇచ్చిన ఇళ్ల పట్టాల పొజిషన్ ఇప్పించాలని కోరారు. గత 20ఏళ్లుగా శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ భవనం కోసం కాపాడుకుంటూ వస్తున్న నల్లగండ్ల సర్వే నెంబరు 82లో ఉన్న 5 గంటల ప్రభుత్వ భూమిని ప్రెస్ క్లబ్ కోసం కేటాయించి, భవన నిర్మాణం చేపట్టేందుకు సహకరించాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి మండలంలో ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపడతామని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తు చేశారు. కార్యక్రమంలో సిద్దార్థ హాస్పిటల్ ఎండి డాక్టర్ సిద్దార్థ్ రెడ్డి, కోవిద సహృదయ వ్యవస్థాపకులు డాక్టర్ అనూహ్య రెడ్డి, పవిత్ర స్కూల్ చైర్మన్ వెంకటేష్, టీయూడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు గంట్ల రాజిరెడ్డి, పులి అమృత్ గౌడ్, శేరిలింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు ఉప్పరి రమేష్ సాగర్, ప్రధాన కార్యదర్శి మెట్టు జగన్ రెడ్డి, మాజీ ప్రధాన కార్యదర్శి పుట్ట వినయ్ కుమార్ గౌడ్, టెంజూ శేరిలింగంపల్లి అధ్యక్షుడు పి.సాగర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కిషోర్ లతో పాటు
ప్రెస్ క్లబ్, టెంజూ కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.