
శేరిలింగంపల్లి, నిఘా24: గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా శేరిలింగంపల్లి డివిజన్ కు మొత్తం 32 నామినేషన్లు దాఖలు చేశారు. డివిజన్ కార్పోరేటర్ అభ్యర్థిత్వం కోసం 24 మంది సభ్యులు 32 నామినేషన్లు వేశారు. ఇందులో ప్రధాన పార్టీలతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నారు. ముఖ్యంగా టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం, టిడిపి తదితర పార్టీల అభ్యర్థులు, రెబెల్స్, ఇండిపెండెంట్లు నామినేషన్ వేశారు. నామినేషన్ వేసిన వారిలో రాగం నాగేందర్ యాదవ్, ఏ. కుమార్, విజయ లక్ష్మి, వీరేశం, శివ కుమార్ ,ఎం.రవి, మల్లేశం, శ్రీనివాస్, రాగం సుజాత, రాగం అనిరుద్, ఎల్లేష్, ప్రేమ్ కుమార్, రేవల రాజేష్, చిట్టి రాజు, నిజాముద్దీన్, సాంబ శివ గౌడ్, మహమ్మద్ హబీబ్, మహేశ్వర్, సతీష్ కుమార్, శామ్యూల్ గౌరీ, గంజి వాసు, మధుసూదన్ తదితరులు ఉన్నారు. కాగా నామినేషన్ ప్రక్రియ ముగియడంతో అభ్యర్థులు ప్రచారపర్వం ప్రారంభించారు.