
హైదరాబాద్, నిఘా 24 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల పర్వం ముగిసింది. నిన్నటి వరకు టికెట్ కోసం, అసమ్మతిని బుజ్జగించడం కోసం హైరానా పడిన అభ్యర్థులు, నేటి నుంచి ముమ్మర ప్రచారం చేపట్టి ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలో నామినేషన్లు ముగిసే సరికి మూడు ప్రధాన పార్టీల మధ్య త్రిముఖ పోరుకు వేదికగా మారింది. మొత్తం 41మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, పోటీ మాత్రం బిఆర్ఎస్ అభ్యర్థి అరేకపూడి గాంధీ, బీజేపీ అభ్యర్థి రవికుమార్ యాదవ్, కాంగ్రెస్ అభ్యర్ధి జగదీశ్వర్ గౌడ్ ల మధ్యే ఉండనుంది. ప్రధాన పార్టీల నుంచి రెబల్స్ ఎవరు నామినేషన్ వేయకపోగా, అధికార బిఆర్ఎస్ పార్టీని మాత్రం ఓ విషయం కలవర పెడుతుంది. శేరిలింగంపల్లిలో అలయన్స్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ పార్టీ (ఆధార్ పార్టీ) నామినేషన్ దాఖలు చేయడం అధికార పార్టీకి గుబులు పుట్టిస్తుంది.

ఆధార్ పార్టీ గుర్తు చపాతీ రోలర్ కావడం విశేషం. ఈ చపాతీ రోలర్ గుర్తు, కారును పోలి ఉండడంతో గతంలో రాష్ట్రంలో జరిగిన పలు ఎన్నికల్లో అధికార బిఆర్ఎస్ పార్టీ నష్టపోయిందని నేతలు భావిస్తున్నారు. గతంలో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో చపాతీ రోలర్ గుర్తు కారణంగానే తాము ఓటమిపాలయ్యామనే భావన అధికార పార్టీ నేతల్లో ఉంది. ఆధార్ పార్టీ గుర్తు చపాతీ రోలర్… టిఆర్ఎస్ పార్టీ గుర్తు కారు…ను పోలి ఉండడంతో నిరక్షరాస్యులైన ఓటర్లు చపాతీ రోలర్ గుర్తును కారు అని భ్రమపడే ప్రమాదం ఉందని అధికార బిఆర్ఎస్ ఆందోళన చెందుతుంది. అసెంబ్లీ ఎన్నికల ప్రకటనకు ముందు చపాతీ రోలర్ గుర్తును తెలంగాణలో కేటాయించవద్దంటూ బిఆర్ఎస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను, కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కాగా శేరిలింగంపల్లి నుంచి ఆధార్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ యాదవ్ సైతం నామినేషన్ వేయడం శేరిలింగంపల్లి బిఆర్ఎస్ నాయకులను ఆందోళనకు గురిచేస్తుంది. అసలే త్రిముఖ పోటీతో ప్రతి ఓటు విలువైనదిగా మారగా, కారును పోలిన చపాతీ రోలర్ తమకు నష్టం చేస్తుందనే భావనలో బిఆర్ఎస్ నాయకులు ఉన్నారు
Dear immortals, I need some wow gold inspiration to create.