
హైదరాబాద్,నిఘా24: సెన్సేషనల్ డైరక్టర్ రాజమౌళికి కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కొద్దిరోజులుగా తమ కుటుంబ సభ్యులకు జ్వరంతో పాటు స్వల్ప లక్షణాలు కనిపించడంతో టెస్టులు చేసుకున్నామని, అందులో కోవిడ్-19 నిర్దారణ అయ్యిందని రాజమౌళి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్టుగా వెల్లడించారు. రాజమౌళి మరో ట్విట్ లో ‘మేమంతా బెటర్ గానే ఉన్నాం. ఏ లక్షణాలు కనిపించడం లేదు. అయినప్పటికీ జాగ్రత్తలతో పాటు సూచనలు పాటిస్తున్నాం. యాంటీబాడీస్ డెవలప్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. అలా జరిగితే మేం కూడా ప్లాస్మాను డొనేట్ చేస్తాం’ అని ట్వీట్ చేశారు.