
శేరిలింగంపల్లి : భారతదేశం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జయంతి సభను చందానగర్ లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. చందానగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరై సావిత్రి భాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో చందానగర్ కార్పొరేటర్ బొబ్బా నవతారెడ్డి, డా.యాదయ్య, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు విక్రమ్ కుమార్, చల్లా శోభన్, రాఘవేందర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
tpe ラブドール